Introduction to the Rajapeta Website

సంస్థానం రాజాపేట కోట చరిత్ర

తెలంగాణా ‘దక్షిణ మహా ద్వారం’ గా పిలువ బడే రాజాపేట సంస్థానం మన రాష్ట్రం లో విశిష్ట మైనది. ఈ సంస్థానం  ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో ప్రముఖ మైనది. ఇది “యాదాద్రి -భువనగిరి”  జిల్లా లో పసిద్ద పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్ట కు కేవలం 20 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మనం చూడవచ్చును. రాజాపేట యొక్క చారిత్రక కట్టడాలు శిధిలావస్థ లో ఉన్నప్పటికీ మనకు సజీవ సాక్ష్యాలు గా ఎన్నొ విశేషాల ను కళ్ళకు కడుతున్నవి.

రాజాపేట సంస్థానం అనేది నిజాం పరిపాలన కాలం నాటి హైదరాబాద్ సంస్థానం లో ఉండినటువంటి 14 సంస్థానాలలో ఒకటి. ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ చారిత్రక కట్టడాలయిన ఎన్నో భవంతులు, అద్దాల మేడలు, తోటలు, సైనికుల కవాతు ప్రదేశాలు, విశాల మైన రహదారులు ఇప్పటికీ చూడవచ్చు.

ఈ రాజాపేట గడీ కోటను పర్యాటక ప్రదేశంగా చేయబూనుతున్నారని ఈ మధ్యనే తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రకటించడం చాల విశేషం అందుకు మొదటి అడుగు గా ఇక్కడ 2014 ఆగస్టులో స్వాతంత్ర వేడుకలు నిర్వహించడం ముదావహం.

ఈ వెబ్ సైట్ ద్వారా ఇన్నాళ్ళు మనకు తెలియని ఎన్నో విశేషాలను సేకరించి మీ ముందు ఉంచడమే నా ముఖ్య ఉద్దేశం.

మరిన్ని వివరాలకై మిగతా పేజీలు, పోస్టులు మరియు ఫోటో గ్యాలరీలు చూడండి. చూసిన వారు తప్పకుండా తమ స్పందన కామెంట్ల ద్వారా తెలియ జేయగలరు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s